అరటి పండుతో ఇలా చేస్తే దెబ్బకు జుట్టు రాలడం ఆగిపోతుంది!!

ఏడాది అంతటా అందుబాటులో ఉండే ఏకైక పండు అరటి. రోజూ ఈ పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయనే సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆహారంగా తీసుకోవడమే గాకుండా తలకు పట్టించడం వల్ల జుట్టు రాలడాన్ని కూడా అరికట్టవచ్చని తాజా పరిశోధకులు కనుగొన్నారు. ఇందులోని పోషకాలు వెంట్రుకల సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. అరటిలో పోటాషియం అధిక మోతాదులో ఉంటుంది. ఫలితంగా అరటి పండు తిన్న వెంటనే శరీరానికి శక్తి అందుతుంది. అరటిలోని విటమిన్లు, ఖనిజాలు జుట్టు రాలడాన్ని ఎఫెక్టివ్ గా అరికడతాయి. అరటి సహజ హెయిర్ కండీషనర్‌లా పని చేస్తుంది. వెంట్రుకలు డ్యామేజీ కావడాన్ని నివారించడంతోపాటు మృదువుగా మారడానికి అరటి ఉపయోగపడుతుంది. ఇంతకూ జుట్టు రాలడం ఆగాలంటే కింద చెప్పిన విధంగా చేయాలి.

 

 

* అరటి పండును, కొబ్బరి పాలను ఓ గిన్నెలోకి తీసుకొని బాగా కలపాలి. తర్వాత దాన్ని తలకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఉసిరి రసాన్ని కూడా ఈ గుజ్జుకు కలపొచ్చు.
* సన్‌ఫ్లవర్ ఆయిల్, నిమ్మరసం, అరటి గుజ్జును కలిపి తలకు పట్టించడం వల్ల కేశాలు బలంగా మారతాయి. ఇందుకోసం అరటి పండును నలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి కుదుళ్లకు పట్టేలా.. తలకు రాసుకోవాలి. 20 నిమిషాలు ఆగాక గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
* చాలా మందిలో చుండ్రు కారణంగా జుట్టు ఎక్కువగా రాలుతుంది. ఇలాంటి వారు అరటి పండు పేస్టును అర కప్పు పెరుగుతో కలిపి తలకు రాసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
* మాడు పొడిబారడం వల్ల కూడా వెంట్రుకలు రాలతాయి. అలాంటప్పుడు అరటి గుజ్జులో ఆలివ్ ఆయిల్ లేదా ఇంట్లో పట్టించిన కొబ్బరి నూనె కలిపి తలకు రాసుకోవాలి. 15 నిమిషాలు ఆగిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. నెలకు రెండుసార్ల చొప్పున ఇలా చేయడం వల్ల ఫలితం ఉంటుంది.

Tags:

how to turn white hair into black naturally in a month,curry leaves for hair growth,grow hair 1 inch in 10 days,curry leaves hair oil,how to turn white hair into black naturally,how to turn white hair into black permanently,how to turn white hair into black hair,how to turn white hair into black in telugu,how to turn white hair into black naturally at home,how to make hair grow faster overnight,hair,hair hacks,diy,life,hacks,white hair,grey hair,black,grow,naturally,dil