ఆంధ్రాలో రాజకీయ పలుకుబడి దాష్టీకానికి బలయిన సాయిశ్రీ ఆఖరు మాటలు వింటే కన్నీరు ఆగదు (వీడియో)

సాయిశ్రీ క్యాన్సర్ తో చనిపోయింది. ఏపీ లో రాజకీయ పలుకుబడి దాష్టీకానికి మరో ప్రాణం గాలిలో కలిసింది. విజయవాడలో సాయిశ్రీకి పన్నెండేండ్లకే ఆయువు తీరింది. అయితే ‘నాకు బతకాలని ఉంది… నన్ను బతికించండి నాన్న… అంటూ 10 రోజుల నుంచి తండ్రిని వేడుకున్నా’ కనికరించలేదు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఈ చిన్నారి చివరకు ప్రాణాలు పోగొట్టుకుంది. అయితే చనిపోయే ముందు సాయిశ్రీ మాట్లాడుతూ తండ్రికి ఓ వీడియా పంపింది. తనను బతికించాలని… తనకు పెద్ద చదువులు చదువుకోవాలని ఉందని తండ్రిని వేడుకుంది. అయినా ఆ తండ్రి కఠిన మనస్సు కరగలేదు.

విజయవాడ దుర్గాపురానికి చెందిన మాధవ శెట్టి శివకుమార్ , సుమశ్రీ కుమార్తె సాయిశ్రీ. గొడవలతో భార్య భర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. భార్య నుంచి విడిపోయే ముందు సాయిశ్రీ పేరిట దుర్గాపురంలో ఇంటిని రాసిచ్చాడు శివకుమార్. శివకుమార్ ఓ రౌడీ షీటర్…. లోకల్ ఎమ్మెల్యే బోండా ఉమాకు అనుచరుడు. సాయిశ్రీ క్యాన్సర్ బారిన పడటంతో కాపాడుకునేందుకు తల్లి సుమశ్రీ చాలా కష్టాలు పడింది. మంచి వైద్యం చేయించకపోతే పాప బతకదని డాక్టర్లు చెప్పారు. వైద్యం కోసం బెంగళూరు తీసుకుపోదామనుకుంది సుమశ్రీ. అయితే డబ్బుల కోసం దుర్గాపురంలున్న ఇల్లుని అమ్ముదామనుకుంటే…. సాయిశ్రీ తండ్రి శివకుమార్ అడ్డుపడ్డాడు. బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు 10 రోజుల నుంచి శివకుమార్ ఇంటికి తిరిగినా పట్టించుకోలేదు. పోలీసులకు చెప్పినా ఉపయోగం లేకుండా పోయింది. పైగా స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరులు వచ్చి పదే పదే బెదిరించేవారిని సుమశ్రీ కన్నీటి పర్యంతమైంది. పాప చివరిసారిగా వీడియోలో మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. కింద వీడియోను క్లిక్ చేసి మీరూ వినండి..