ఈ జంట రియల్ ‘జర్నీ’ ఏంటో తెలుసా?!!

ముందు మేమిద్దరం ఫ్రెండ్స్ అంటారు. మామ‌ధ్య ఏమీ లేదంటారు. ఆ త‌ర్వాత ప్ర‌పంచం ఏం మాట్లాడుకున్నా పెద్ద‌గా ప‌ట్టించుకోమంటారు. చివ‌ర‌కు మాత్రం ఫ్రెండ్స్ అని చెప్పుకున్న‌వారే పెళ్లికి సిద్ధ‌ప‌డ‌తారు. కాపురాలు చేస్తారు. ఇది సెల‌బ్రిటీల విష‌యంలో క్వైట్ కామ‌న్‌. అలాంటి జంటే ఇప్పుడు వార్త‌ల్లో నిలిచింది. షాపింగ్ మాల్ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన‌ప్ప‌టికీ.. జ‌ర్నీసినిమాతో పాపుల‌ర్ అయ్యింది అంజ‌లి. అదే సినిమాలో జైకు జోడీగా న‌టించింది. ఆ స‌మ‌యంలోనే ఇద్ద‌రి స్నేహం చిగురించింది. ఆ త‌ర్వాత అది ప్రేమ‌గా మారిన‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. వీటికి బ‌లాన్ని చేకూరుస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఇద్ద‌రూ త‌మ రిలేష‌న్‌పై యాక్టివ్‌గా ఉంటున్నారు.