చరిత్రలో అసలు బాహుబలి ఒరిజనల్ క్యారెక్టర్ ఏంటో తెలుసా.. రాజమౌళి చూపించలేకపోయిన అసలు స్టోరీ!!

బాహుబలిని వీఎఫ్ఎక్స్ టెక్నాలజీతో అద్భుతమైన గ్రాఫిక్స్, యానిమేషన్ నైపుణ్యంతో రాజమౌళి తెరకెక్కించారు. ఇక బాహుబలి పేరు వింటే ఆ మహాద్భుత సుందర దృశ్యాలు, కండలు తిరిగిన బల్లాలదేవుడు, బాహుబలి మాత్రమే మనకు గుర్తుకొస్తారు. కాని చరిత్రలో బాహుబలి ఓ గొప్ప రాజు. నైతిక విలువలకు ప్రాధాన్యమిచ్చి తమ్ముడితో యుద్ధం ఒద్దని తలచి రాజ్యాన్ని త్యాగం చేసేందుకు బయలుదేరిన త్యాగదనుడు. అతడి తమ్ముడు ఈ సినిమాలో మాదిరిగానే రాజ్య కాంక్షతో బాహుబలితో కాలు దువ్వుతాడు. కొన్ని సారూప్యతలున్నా, సినిమాటిక్ గా తీసే క్రమంలో బాహుబలి అసలు కథను రాజమౌళి పరిగణలోకి తీసుకోలేదు. అంటే సినిమా రక్తి కట్టదనే అతడి నిజజీవితంలో కొన్ని అంశాలను మాత్రమే ఇతివృత్తంగా తీసుకున్నారు. కాని సినిమాలో చూపించిన దానికంటే కూడా బాహుబలి గొప్ప బలశాలి, ధైర్యశాలి, మానవతా విలువలున్న మనిషి.

జైన విష్ణు పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన రిషభదేవుడు (వృషభనాథుడు), సునందల కుమారుడు బాహుబలి, ప్రస్తుత తెలంగాణరాష్ట్రంలోని బోధన్ (పోదనపురం) రాజధానిగా బాహుబలి రాజ్యపాలన చేశాడు. జైనమతానికి సంబంధించిన మొదటి తీర్థంకరుడుగా పేరుగడించిన రిషభదేవుడు అయోధ్య రాజధానిగా రాజ్యపాలన చేశాడు. ఆయనే ఇక్ష్వాకు వంశాన్ని ప్రారంభించాడని జైన మతస్తులు విశ్వసిస్తున్నారు. సునందాదేవి, యశస్వతీ దేవి (సుమంగళీదేవి అని కొందరు ఉదహరిస్తున్నారు) అనే ఇద్దరు రాకుమార్తెలను రిషభదేవుడు వివాహమాడాడు. సుమంగళకు 99 మంది కుమారులు, బ్రహ్మి అనే కుమార్తె జన్మించారు. కుమారుల్లో పెద్దవాడి పేరు భరతుడు. సునందకు బాహుబలి అనే కుమారుడు, సుందరి అనే కుమార్తె జన్మించారు. (విష్ణుపురాణం భరతుడు, బాహుబలి ఇద్దరే రిషభదేవుని కుమారులని చెబుతోంది). సినిమాలో బల్లాల దేవుడికి, బాహుబలికి వైరం ఉన్న మాదిరిగానే వాస్తవ చరిత్రలోనూ భరతుడు, బాహుబలికి మధ్య విభేదాలున్నాయి. అసలు కథను కింది వీడియో క్లిక్ చేసి తెలుసుకోండి..

 

Devils,Ghost,Aliens,telugu news,world news,trending news,Bahubali,Shravanabelgola,India,Karnataka,Jain,original Bahubali,Real Bahubali,raki cool,historical,Jainism,Baahubali Release,Baahubali (Film),Baahubali Tickets,Baahubali Ticket Rates,Rajamouli,Baahubali Trailer,Baahubali Movie Trailer,Bahubali trailer,Bahubali theatrical trailer,Prabhas Baahubali Trailer,#BaahubaliTrailer,Baahubali Official Trailer,Baahubali The Beginning Trailer,telugumojo