తెల్లజుట్టు, బట్టతల రావడానికి అసలు సిసలు కారణాలివే!!

ప్రస్తుత కాలంలో యువత ఎదుర్కొంటున్న శారీరక సమస్యల్లో ప్రధానమైనవి జుట్టు నెరవడం, బట్టతల. వీటి వల్ల చాలా మంది తీవ్ర డిప్రెషన్ బారినపడుతున్నారు. ఈ సమస్యలకు కారణాలను యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌కు చెందిన సౌత్‌వెస్ట్రన్‌ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు గుర్తించారు. కేఆర్‌ఓఎక్స్‌ 20 పేరుతో పిలిచే ప్రొటీన్‌ నరాల అభివృద్ధి అనుబంధంగా ఉంటుంది. ఈ సందర్భంలోనే జుట్టు పెరుగుదల కారకంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ మూలకణ కారకం (ఎస్‌సీఎఫ్‌) జుట్టుకి రంగును ఇస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ రెండూ సరిగ్గా ఉంటేనే జుట్టు మంచి రంగుతో, ఒత్తుగా పెరుగుతుందని వారు వెల్లడించారు. వీటిని నిర్ధరించుకోడానికి ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ముందు కేఆర్‌ఓఎక్స్‌ 20 ప్రోటీన్‌‌ను ఓ ఎలుక కణాల నుంచి తొలగించినప్పుడు దాని జుట్టు పెరుగుదల వెంటనే ఆగిపోయిందని తెలియజేశారు. ఆ తరువాత మరో ఎలుకలో మూలకణ కారకాన్ని తొలగించినప్పుడు దాని రంగు తెల్లగా మారినట్లు గుర్తించారు. ఈ రెండు కారకాలపైనే జుట్టు పెరుగుదల, రంగు ఆధారపడి ఉంటాయని నిర్ధరణకు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు.

 

అనారోగ్యాన్ని వ్యాపింపజేసే కణితుల పెరగడానికి సహకరించే జన్యువులపై అధ్యయనం చేపట్టినప్పుడు జుట్టు నెరవడం, బట్టతలకు సంబంధించిన కారణాలు వెలుగుచూసినట్లు డెర్మటాలజీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ లూ లే, కాంప్రెహెన్షివ్ కేన్సర్ సెంటర్‌కు చెందిన హరాల్డ్ సి సిమన్స్ తెలియజేశారు. ఈ పరిశోధనలు ఇక మనుషులపై సాగిస్తామని వారు వివరించారు. ఈ పరిశోధన వ్యాసాలను జెనిస్ అండ్ డెవలప్‌మెంట్ ఆన్‌లైన్ జర్నల్‌లో ప్రచురించారు.

Tags:

white hair to black hair naturally,White hair treatment naturally,How to change white hair to black hair,white hair to black hair,premature hair graying,premature hair greying remedies,white hair treatment,white hair to black hair naturally in hindi,white hair to black hair naturally for men,white hair problem solution,white hair treatment at home,white hair to black hair permanently,causes of premature hair graying,home remedy for white hair,remove dandroff