నిమ్మకాయను కట్ చేసి బెడ్ పక్కన పెట్టుకుని పడుకుంటే ఏమవుతుందో తెలుసా?!!

నిమ్మ కాయలను ఆహారంగా తీసుకుంటే లభించే ప్రయోజనాల గురించి ఆరోగ్య స్పృహ కలిగిన వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగడం వల్ల బరువు తగ్గుతారని ఇప్పుడు చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. నిమ్మలో విటమిన్-సితో పాటు కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఎండాకాలంలో వేడితో బాధపడేవారు నిమ్మరసాన్ని నీటితో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుందని మన పూర్వీకుల నుంచి తాగుతున్న పానీయం. అందుకే వేసవి కాలం విరివిగా లెమన్ వాటర్ అమ్ముతుంటారు ఎక్కడ పడితే అక్కడ. నిమ్మను ఆహారంగా తీసుకోవడమే కాదు.. ఇతరత్రా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

నిమ్మకాయను ముక్కలుగా కోసి బెడ్ రూంలో పెట్టుకుని నిద్రపోవడం వల్ల అనేక ఉపయోగాలున్నాయి. నిమ్మ ముక్కలు గదిలోని గాలిని శుభ్రపరుస్తాయి. గది కూడా పరిమళ భరింతగా మారుతుంది.
* కొన్ని నిమ్మకాయలను ముక్కలుగా తరిగి బెడ్రూంలో ఉంచుకొని నిద్రించడం వల్ల శ్వాస చక్కగా తీసుకోగల్గుతారు. ఊపిరి తీసుకోవడం ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
* ఒత్తిడి దూరం కావడానికి కూడా ఈ చిట్కా తోడ్పడుతుంది. ఆస్తమా, అలర్జీలు, జలుబు తదితర సమస్యలతో బాధపడుతున్నవారు నిమ్మ ముక్కలను పడక గదిలో ఉంచుకొని నిద్రించడం ఫలితాన్నిస్తుంది. నీరసం కూడా మాయమవుతుంది.
* దోమలు ఎక్కువగా ఉంటే నిమ్మ కాయను కట్ చేసి లవంగాలను గుచ్చి పడుకునే గదిలో ఉంచుకుంటే సరి. దోమలు పారిపోతాయి. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా డెంగ్యూ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలు దరిదాపుల్లోకి కూడా రావని పరిశీలనాత్మకంగా కనుగొన్నారు.

 

Tags:

 

How to grow hair faster,home remedies for faster hair growth,herbal hair oil for faster hair growth,curry leaf herbal oil for fast hair growth,how to get thick hair,how to cure hair fall,hair oil massage for faster hair growth,curry leaf oil starnatural beauties,herbal oil star natural beauties,herbal oil deepa suresh,herbal oil deeps kitchen,sneha beauty tips for hair