బాహుబలిలో ఆ సీన్ చూస్తూ ఏడ్చేసిన రమ్యకృష్ణ

తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడులోనూ ఇప్పటివరకు ‘నీలాంబరి’గా ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించిన రమ్యకృష్ణను ఇప్పుడు దేశవ్యాప్తంగా ‘శివగామి’ అని పిలుస్తున్నారు. అంతగా ఆ పాత్రలో లీనమైపోయింది రమ్యకృష్ణ. ‘నా మాటే శాసనం’ అంటూ ఒకవైపు రాజసం ప్రదర్శిస్తూనే సెంటిమెంట్‌ను కూడా అద్భుతంగా పండించింది.ఇంతటి విజయంలో కీలకపాత్ర పోషించిన రమ్యకృష్ణకు ‘బాహుబలి: ది కంక్లూజన్‌’ సినిమాలో ఓ సీన్‌ ఏడుపు తెప్పించిందట. ఆ సీన్‌లో నటిస్తున్నప్పుడు కంటే తెరపై చూస్తున్నప్పుడే ఎక్కువ భావోద్వేగానికి గురైందట రమ్యకృష్ణ.