బాహుబలి సక్సెస్ వెనుక చిరంజీవి పాత్ర ఏమిటో తెలుసా?!! (వీడియో)

అవును ఇది కాసింత ఆశ్చర్యంగా ఉన్నా అక్షరాలా నిజం. సినీ పరిశ్రమలోని వారికయితే ఇది చాలా వరకు తెలిసిందే. దీని వెనుక ఓ నేపథ్యం ఉంది. గొప్ప అనుభవ స్ఫూర్తి ఉంది. ఓ మహాభవన నిర్మాణంలో ఎన్నో రాళ్లు ఉన్నా అవి పైకి కనిపించవు. కొందరి మహోన్నత విజయాల వెనుక ఉండే నేపథ్యమూ అంతే. బేసిగ్గా రాజమౌళిది ఫాంటసీ వరల్డ్. అద్భుత ఊహా ప్రపంచం.. దీనికి ఆయన తీసిన చిత్రాలే ఉదాహరణ. వీటిలో యమదొంగ గొప్పది. జనాన్ని ఉర్రూతలూపింది. ఈ చిత్రం తర్వాత జానపద జిమ్మిక్కులతో వడ్డించిన వినోద భోజనం మగదీర. ఈ చిత్రం నిర్మాణ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళికి అనుబంధం ఏర్పడింది.. అది బాహుబలి వరల్డ్ రికార్డు వరకు ఎలా సాగిందో తెలుసుకోవాలంటే కింది వీడియోను క్లిక్ చేయండి..