భరితెగించిన బ్యాంకులు.. ఖాతా రద్దు చేసుకోవాలంటే ఎంత కట్టాలో తెలుసా?!

భారత దేశంలో బ్యాంకుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఓవైపు నరేంద్రమోఢీ ప్రభుత్వం లావాదేవీలన్నీ బ్యాంకుల ద్వారానే జరగాలని షరతులు పెడుతుండగా.. ఇదే అదునుగా బ్యాంకులు రెచ్చిపోతున్నాయి. రోజుకొక కొత్త రకమైన ఛార్జీలను ప్రకటిస్తూ ఖాతాదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఓ కొత్త రూల్ ఇంటర్డ్యూస్ చేసింది. బ్యాంకులో ఖాతాను వద్దనుకునే వారు, దాన్ని రద్దు చేసుకునే పక్షంలో సేవింగ్స్ ఖాతా అయితే, రూ. 575, కరెంట్ ఖాతా అయితే రూ. 1000 జరిమానా విధిస్తోంది. దీంతో ఖాతాదారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రూట్ లోనే మిగిలిన బ్యాంకులు నడిచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎస్ బీఐ..

మెట్రోల్లో రూ. 5 వేలు, నగరాల్లో రూ. 3 వేలు, పట్టణాల్లో రూ. 2 వేలు, గ్రామాల్లో కనీసం రూ. 1000 ఖాతాలో ఉంచాల్సిందేనని బ్యాంకు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తాలను నిర్వహించలేమని, తమకు ఖాతాలు వద్దని చెబుతూ, రద్దు చేసుకునేందుకు వెళ్లిన కస్టమర్లపై ఇప్పుడు బాదుడు షురూ చేసిన బ్యాంకు వైఖరిపై ఇప్పుడు మరిన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

sbi new rule from 1 april 2017 minimum balance,sbi atm withdrawl limit,sbi cash deposit 1 april 2017

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *