మీ ఆరోగ్యానికి డోకా లేకుండా ఉండాలంటే రోజూ ఇది కొంచెం తాగితే చాలు!!

ఇప్పుడు ఐశ్వర్యం కంటే ఆరోగ్యం ముఖ్యమై పోయింది. ఒకప్పుడు మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అదెంత విలువైన మాటో ఇప్పటి తరానికి ఇప్పుడిప్పుడే తెలిసి వస్తోంది. మూడు పదుల వయసు రాకుండానే ముప్పు తిప్పలు పెడుతున్న రోగాలు.. హెల్త్ పికాషన్స్ లేకపోతే భవిష్యత్ జీవితం లేదని హెచ్చరిస్తున్నాయి. అయితే మంచి ఆరోగ్యం కోసం చేయాల్సినవి చాలానే ఉన్నాయి. రోజూ గంజి తాగితే ఆరోగ్యానికి ఎటువంటి డోకా ఉండదు. ఇదేంటి గంజి తాగితే అంత ఫలితమా అనుకుంటున్నారా? నిజం రోజు గంజి తాగితే ఎంతో ఫలితం ఉంటుంది. ఎలాంటి ఫలితాలు ఉంటాయో కింద వివరంగా తెలుసుకుందాం…

 

1.మండం – మండం అంటే ఒక పాళ్ళు బియ్యం,14 పాళ్ళు నీళ్ళు పోసి… ప్రెజర్ కుక్కర్ లో పెట్టి వండితే దీనిని మండం అంటారు. చాలా రోగాలకు ఇది పత్యం లా పనిచేస్తుంది. జ్వరం, విరేచనాలు, నిస్సత్తువుని తగ్గించమే కాకుండా బడలికని పోగొడతుంది. మందులు ఎక్కువగా వాడేవారు దీనిలో నిమ్మరసం కలిపి తాగితే పేగులు శిథిలం కాకుండా ఉంటాయి.
2.ఒక పాళ్ళు బియ్యం,ఆరు పాళ్ళు నీళ్ళు పోసి వండిన జావని యావాగు అంటారు.
3.ఒక పాళ్ళు బియ్యం, నాలుగు పాళ్ళు నీళ్ళు పోసి వండిన జావని వివేపి అంటారు. ఈ మూడు రకాలు కూడా గంజి లాంటివే. గుండె జబ్బు, గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట ఉన్నవారు, ఎక్కువగా మందులు వాడేవారు ఇంకా అనేక అనారోగ్యాలతో బాధపడేవారు వీటిని తాగవచ్చు.
రోజు ఇది తాగటం వలన జీర్ణ శక్తిని పెంచి, పేగుల్ని సంరక్షిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Tags:

Amazing Benefits of Curd With Ginger,Best Health Tips in Telugu,Health Facts Telugu,Health Facts,Benefits of Curd,Curd and Ginger,Advantages of Ginger,Advantages of Curd and Ginger,Latest News,Latest Updates,Health Benefits of Curd,Health Benefits of Curd and Ginger,Health Benefits,Health Benefits in Telugu,Best Health Tips