రాష్ డ్రైవింగ్ లో నిషిత్ తాతలా ఉన్నాడు.. ఆ కారుతో వణికిపోయిన మాదాపూర్!!

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మంత్రి నారాయ‌ణ కొడుకు నడిపిన కారు ప్ర‌మాద ఘ‌ట‌న మ‌రువ‌క ముందే హైద‌రాబాద్‌ మాదాపూర్‌లో మ‌రో కారు బీభ‌త్సం సృష్టించింది. అతివేగంగా వ‌చ్చిన స్కార్పియో కారు రెండు కార్ల‌ను , 4 బైకుల‌ను ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒకరు మృతి చెందగా న‌లుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీకెండ్ కావ‌డంతో మాదాపూర్ ప్రాంతం అత్యంత ర‌ద్దీగా ఉంటుంది. అదే స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ట్రాఫిక్ ఎక్క‌డికక్క‌డే నిలిచిపోయింది. కారు ఎవ‌రిది..ఎవ‌రు న‌డిపార‌న్న విష‌యంపై పోలీసులు ఎంక్వెరీ చేస్తున్నారు.

మొత్తానికి హైదరాబాద్ ఇప్పుడు రాష్ డ్రైవింగ్ తో వణికిపోతోంది. ఏ టైంలో ఏ వైపు నుంచి బడాబాబుల కార్లు వచ్చి గుద్దుతాయోనని సామాన్యులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని తిరుగుతున్నారు. రాత్రి వేళ మద్యం మత్తులో అస్తవ్యస్థంగా వాహనాలు నడిపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహా నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు. స్పీడ్ లిమిట్ క్రాస్ చేసిన వారిపై తీసుకునే చర్యలు తీవ్రంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

witness,evidence,witness on nishit death,evident on nishit death,AP Minister Narayana Son Died In Car Accident,AP Minister,minister Narayana,minister narayana Son died,AP Minister Narayana son accident,accident,ap minister Narayana Son Death,Hyderabad,nishith road accident,Car Accident,nishith car hits metro pillar,ap minister narayana son road accident,narayana institutions,jubilee hills,car accident in hyderabad,ap cm,hmtv live,hmtv,hmtv news