రూ.18కోట్లు తలుపు తడితే ఒద్దు పొమ్మన్న ప్రభాస్.. ఎందుకో తెలుసా?!!

బాహుబలి సినిమాతో యునివర్సల్ స్టార్‌గా మారిపోయాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో ప్రభాస్‌కు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక క్రేజ్ ఉన్న హీరోతో సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు క్యూ కట్టడం సహజం. కానీ ప్రభాస్ క్రేజ్ ఏకంగా 18 కోట్లు పలికింది. తమ బ్రాండ్లకు ప్రభాస్‌తో ప్రచారం చేయిస్తే దూసుకుపోవచ్చని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రభాస్ ఇంటి వద్ద ఆయా సంస్థల ప్రతినిధులు క్యూ కడుతున్నారని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ప్రభాస్‌తో ఇప్పటికే పలు సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. తమ ఉత్పత్తులకు ప్రచారకర్తగా వ్యవహరించాలని కోరారు. కానీ ప్రభాస్ మాత్రం ఏ ఒక్క డీల్‌కు ఇంతవరకూ ఓకే చెప్పలేదట. ఇప్పుడు కూడా అలాగే ప్రభాస్‌ను వెతుక్కుంటూ వచ్చిన 18 కోట్ల డీల్‌కు ప్రభాస్ నో చెప్పాడట. కొన్ని షూ కంపెనీలు, ఫిట్‌నెస్, ఎఫ్‌ఎమ్‌జీసీ ఉత్పత్తులకు సంబంధించిన కంపెనీలు ప్రభాస్‌తో డీల్ కుదుర్చుకునేందుకు సంప్రదించాయి.

ఈ డీల్స్ విలువ 18 కోట్ల పైమాటేనట. వీటన్నింటినీ ప్రభాస్ వదులుకున్నాడని టాక్. ప్రస్తుతం తను చేస్తున్న సాహో సినిమా పైనే ప్రభాస్ దృష్టి పెట్టాడని, ఆ సినిమా పూర్తయిన తర్వాతే ఏ డీల్ అయినా కుదుర్చుకునే ఉద్దేశంలో ఉన్నాడని తెలుస్తోంది. పైగా బాహుబలి2 సినిమా బాలీవుడ్‌లో కూడా ఘన విజయం సాధించడంతో పలువురు బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు ప్రభాస్‌తో సినిమాలు తీయడానికి ఉవ్విళ్లూరుతున్నారట. ఇలాంటి సమయంలో యాడ్స్ కంటే సినిమాలే ముఖ్యమని ప్రభాస్ భావిస్తున్నాడట. పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడని కూడా సమాచారం. ఇలా రకరకాల కారణాల వల్ల కోట్ల రూపాయల డీల్స్‌ను ప్రభాస్ వదులుకుంటున్నట్లు సమాచారం. కానీ క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రభాస్‌కు కొందరు సినీ ప్రముఖులు సలహాలిస్తున్నారు

.