లేటెస్ట్: కాంట్రాక్టు ఉద్యోగులు పండుగ చేసుకునే న్యూస్.. సీఎం కీలక నిర్ణయం

లేటెస్ట్: కాంట్రాక్టు ఉద్యోగులు పండుగ చేసుకునే న్యూస్.. సీఎం కీలక నిర్ణయం

కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త. వేతనాలను ఒకేసారి 50 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వివిధ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న 26 వేల మందికి ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ అప్రూవల్ తో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం ఈ ఏడాది కాంట్రాక్టు ఉద్యోగులకు చల్లని కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు చాలీచాలని జీతభత్యాలు ఉన్నాయని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. దీంతో స్పందించిన సీఎం.. కాంట్రాక్టు ఉద్యోగుల జీతభత్యాలపై ఉపసంఘాన్ని నియమించారు. మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో ఈ ఉపసంఘం పలు దఫాలు సమావేశమై కాంట్రాక్టు ఉద్యోగులకు 50 శాతం జీతాన్ని పెంచాలని సీఎంకి సిఫారసు చేసింది. దీనికి సీఎం ఆమోదం తెలిపారు. తాజాగా కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. కాంట్రాక్టు ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ.12 వేలు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

2010 పీఆర్సీ ప్రకారం ప్రస్తుతం జీతాలు అందుకుంటూ రూ.12 వేల కంటే తక్కువగా వేతనం పొందుతున్న వారికి ఈ పెంపు వర్తిస్తుంది. పెరిగిన జీతాలు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌ వస్తుసేవల పన్ను-2017 ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాష్ట్ర యువత క్రీడల్లో నైపుణ్యం సాధించేందుకు అనుగుణంగా ఏపీ క్రీడా విధానానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. ఈ విధానం 2017-2022 వరకు అమల్లో ఉంటుంది.

కొత్త పోస్టుల మంజూరు
పంచాయతీరాజ్‌ శాఖలో 20 మందిని, రోడ్లు, భవనాల శాఖలో 18 పోస్టులు, గ్రేటర్‌ విశాఖ పురపాలక సంఘంలో 22 పోస్టులు, ఉడాలో తొమ్మిది, అటవీ శాఖలో 17 పోస్టులు మంజూరు చేశారు. అదే సమయంలో కొత్త మంత్రుల వద్ద 88 మంది సిబ్బందిని నియమిస్తూ ఇచ్చిన జీవో ఎంఎ్‌సనెం.69కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. హ్యాండీ కాప్డ్ అభ్యర్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పై ట్రైనింగ్ ఇచ్చేందుకు విజయవాడలో ఏర్పాటు చేసిన స్టడీసర్కిల్‌లో బోధన, బోధనేతర సేవలను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో సమకూర్చునేందుకు కూడా సోమవారం భేటీ అయిన మంత్రిమండలి అంగీకరించింది.