వైఎస్ మొదటి సారి సీఎంగా ప్రమాణం చేసిన రోజు ఏపీలో ‘రాజన్న క్యాంటీన్’కు శ్రీకారం రూ.4కే భోజనం.. మెనూ ఏంటంటే?!!

తెలంగాణా ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ లో అమలు చేస్తున్న 5 రూపాయలకే కడుపునిండా భోజనం ఓ ఆంధ్రా ప్రజాప్రతినిధిలో ఎల్లెడలా స్ఫూర్తి నింపింది. తను స్వయంగా పరిశీలన జరిపి మరీ తన నియోజకవర్గమైన గుంటూరు జిల్లా మంగళగిరిలో అమల్లోకి తెచ్చారు వైఎస్సార్ సీపీ ఎంఎల్ఏ ఆళ్ల రామకృష్ణారెడ్డి. 14వ తేదీ ఆదివారం నుంచి మంగళగిరిలో ప్రతి పేదవాడికీ రూ.4లతో కడుపునింపాలని ఆయన డిసైడ్ అయ్యారు. అయితే ఆ తేదీనే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 2004 మే 14 వ తేదీన తొలిసారిగా ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేశారు. ఆరోజును స్పూర్తిగా తీసుకుని.. మంగళగిరి ఎంఎల్ఏ తన నియోజక వర్గంలో పేదవాడి ఆకలి తీర్చాలని ఓ మంచి ఆశయంతో ‘రాజన్న క్యాంటీన్’ మొదలుపెట్టారు. దీని ద్వారా కేవలం 4 రూపాయలకే కూర అన్నం, పెరుగు అన్నం, వారం లో 4 రోజులు ఒక కోడిగుడ్డు, మిగిలిన 3 రోజులు అరటి పండు, వడియాలు, వాటర్ ప్యాకెట్ ఇవ్వనున్నారని సమాచారం.


ఈ క్యాంటీన్ ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు మంగళగిరి పట్టణం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేస్తారు. నిత్యం 3-5 వందల మందికి ఈ భోజనం అందజేస్తారు. ఈపథకాన్ని రామకృష్ణారెడ్డి తన సొంత నిధులతో ప్రారంభించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తన ఎన్నికల్ల మానిఫాస్టో లో ఈపతకాన్ని చేర్చి… రాష్ట్రవ్యాప్తంగా అమలు చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల అంతర్గత ప్రచారం. అయితే ట్రయిల్ బేస్ లో మంగళగిరిలో ఈ పథకం రెస్పాన్స్ చూడనున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో దివంగత సీఎం జయలలిత అమలు చేసిన అమ్మా క్యాంటీన్ పథకమే ఈ తెలంగాణ, ఆంధ్రా పథకాలన్నిటికీ మార్గదర్శకం.